Senior Resident posts: సీనియర్ రెసిడెంట్ పోస్టులకు రిక్రూట్మెంట్! 1 y ago
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ హాస్పిటల్స్, వైద్య కళాశాలల్లోని వివిధ విభాగాల్లో మొత్తం 1183 సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి నియామక ప్రకటన వెలువడింది. ఈ పోస్టులకు మెడికల్ పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన అభ్యర్ధులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయసు 44 సంవత్సరాల లోపు ఉండాలి. ఎంపిక ప్రక్రియ పోస్టు గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు ఫీజు ఓసీ అభ్యర్ధులు రూ. 2000, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్దులకు రూ. 1000. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది మార్చి 22. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.